ఈసారి ముగ్గురు భామలతో :మహేష్ బాబు..

దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో హిట్ ఫెయిర్ అనిపించుకున్న మహేష్ బాబు సమంతలు మరో సారి జత కట్టనున్నారు. కుటుంబ కథా చిత్రాలను, తనదైన బాణీ లో తీసే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో రానున్న తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’.లో సామంత కూడా నటించనుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, తో పాటు కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 27నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. షెడ్యూల్స్ లో మొదటి నుంచి ప్రణిత, కాజల్ అగర్వాల్ లు షూటింగ్ లో పాల్గొనగా సమంత ఈ లేటెస్ట్ షెడ్యూల్ నుంచి సమంత కూడా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం వీరిద్దరి పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక నుంచి జరగబోయే అన్ని షెడ్యూల్స్ లో సమంత ఏకదాటి గా పాల్గొంటుంది. ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మించనున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.